అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు

అంబేద్కర్‌కు ఘనంగా నివాళులు

VZM: గజపతినగరంలోని మండల సమాఖ్య కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గజపతినగరం ఏపీఎం నారాయణరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు సిబ్బంది పాల్గొన్నారు.