గాజువాకలో వైసీపీ సంతకాల సేకరణ
VSP: వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని డిమాండ్ చేస్తూ గాజువాకలో వైసీపీ నాయకులు శుక్రవారం ఏకలవ్య వీధిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడాన్ని నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు.