మహిళల జోలికొస్తే సహించేది లేదు: రాయపాటి
AP: పల్నాడు జిల్లాలో ఇటీవల ఒంటరి మహిళపై జరిగిన అత్యాచార ఘటనను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ఖండించారు. గుంటూరు GGHలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను ఆమె ఫోన్‌లో పరామర్శించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మహిళల జోలికొస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని స్పష్టం చేశారు.