ఫ్లెక్సీల ముద్రణలో అనుమతులు తప్పనిసరి: కలెక్టర్
కోనసీమ: ఫ్లెక్సీలు ముద్రించే వ్యాపార నిర్వాహకులు చట్టపరమైన అనుమతులు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద మంగళవారం ఫ్లెక్సీల షాపుల కమిటీ సభ్యులతో ఆయన సమావేశం అయ్యారు. ఫ్లెక్సీల వల్ల శాంతిభద్రతల సమస్యలు, పర్యావరణం ఇబ్బందులపై చర్చించారు. నిబంధనలో మేరకే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.