నగరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుక

నగరంలో ఘనంగా శ్రీరామనవమి వేడుక

HYD: నగరంలో శ్రీరామనవమి వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతూ.. సీతారాముల కల్యాణం కనులపండువగా నిర్వహించారు. నగరంలోని సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల పాఠశాల వరకు శ్రీరామనవమి శోభయాత్ర కొనసాగింది. దారి పొడవునా నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు హనుమాన్ సమేత సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను దర్శించుకుని పూజలు చేశారు.