మైత్రి ట్రాన్స్ జెండర్ క్లినిక్ ప్రారంభం

JGL: జగిత్యాల జిల్లాలోని మాతశిశు ఆరోగ్య కేంద్రంలో ట్రాన్స్ జెండర్ల ప్రత్యేక క్లినిక్‌ను జిల్లా సంక్షేమ శాఖ అధికారి డా. నరేష్, మాతశిశు ఆరోగ్య కేంద్రం సూపరిండెంట్ రాములు సోమవారం ప్రారంభించారు. ఈ క్లినిక్‌ల ద్వారా ఆరోగ్య, ఆరోగ్యేతర సేవలపై కౌన్సిలింగ్, లింగ ఆధారిత సేవలు, సాధారణ ఆరోగ్య సేవలు, లైంగికంగా సంక్రమించే వ్యాధులకు చికిత్స, సామాజిక అర్హత సేవలను అందించనున్నారు.