మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలి

అన్నమయ్య: మదనపల్లెను జిల్లాగా వెంటనే ప్రకటించాలని బివైఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు. సోమవారం సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జిల్లా చేయడంలో గత పాలకులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం మోసం చేశారని ఆరోపించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం జిల్లాగా ప్రకటించాలన్నారు.