నాగంబాయితాండలో లోకేశ్ నాయక్ గెలుపు

నాగంబాయితాండలో లోకేశ్ నాయక్ గెలుపు

MBNR: హన్వాడ మండలంలోని 18 గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నాగంబాయితాండ సర్పంచ్‌గా వడ్డే లోకేశ్ నాయక్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థిపై గెలుపొందారు. ఈ విజయంతో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాలుస్తూ సంబరాలు జరిపారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విజేతకు శుభాకాంక్షలు తెలిపారు.