లింగాపూర్‌లో పర్యటించిన ఆత్రం సుగుణ
ASF: లింగాపూర్ మండలంలో ఆదివారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పర్యటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన పలువురు సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో వారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలను గడప గడపకు తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.