INSPIRATION: బారు అలివేలమ్మ
బారు అలివేలమ్మ.. స్వాతంత్య్ర సమరయోధురాలు. 1897లో కాకినాడలో జన్మించిన ఆమె బహు భాషా కోవిదురాలుగా గుర్తింపు పొందారు. అప్పటి మహిళల విద్య కోసం ఎంతో కృషి చేశారు. అలాగే స్త్రీలకు స్వాతంత్య్రోద్యమం గురించి అవగాహన కల్పించి పోరాటంలో పాల్గొనేలా చేశారు. విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.