రైలు పట్టాలపై మహిళ మృతదేహం లభ్యం
GNTR: తెనాలి మండలం అంగలకుదురు గ్రామం వద్ద రైలు పట్టాలపై గురువారం రాత్రి ఓ గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.