పోలం పనులు చేస్తుండగా వజ్రం లభ్యం

పోలం పనులు చేస్తుండగా వజ్రం లభ్యం

KRNL: తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తున్న కూలీకి వజ్రం దొరికింది. రూ. 300 కూలికి వెళ్లిన ఆ కూలీ భూమిలో మెరిసిన రాయిని తీసి స్థానిక వ్యాపారికి చూపించాడు. అది వజ్రమని నిర్ధారించగా, రూ. 40 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రతి ఏటా వర్షాలు మొదలయ్యే సమయంలో పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతారు.