తప్పిన ప్రమాదం.. డ్రైనేజీలోకి దూసుకెళ్లిన బస్సు
ATP: తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. తాడిపత్రి నుంచి ఊరుచింతలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న డ్రైనేజీ గుంతలో పడింది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు.