శ్రీ కనకదుర్గ ఆలయంలో అష్టమి వార్షికోత్సవాలు

AKP: అనకాపల్లి గవరపాలెం శతకంపట్టు శ్రీ కనకదుర్గా అమ్మవారి ఆలయంలో అష్టమి వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం వేడుకుల్లో భాగంగా ఆలయ శాశ్వత ఛైర్మన్, కాండ్రేగుల నాయుడు భాగ్యలక్ష్మి దంపతులు ఆలయం వద్ద పెండ్లిరాట వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు రమణ, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.