రిమాండ్ ఖైదీ పరార్
NDKL: కల్వకుర్తి పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం తీసుకువచ్చిన ఒక ఖైదీ పరారైనట్లు సమాచారం అందింది. APలోని అనంతపురం జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ ఖైదీని ఓ కేసు విచారణలో భాగంగా పోలీసులు గురువారం అతనిని కస్టడీకి తీసుకొచ్చారు. అర్ధరాత్రి బహిర్భూమికని బాత్రూంలోకి వెళ్లిన అతను కిటికీ నుంచి పరారైనట్లు సమాచారం. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది.