సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

VSP: దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం నుంచి ఖరీఫ్ అవసరాలకు సాగునీటిని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మంగళవారం విడుదల చేశారు. రైవాడ ఎర్రకాలమ్మను దర్శించుకున్న అనంతరం జలాశయం వద్ద పూజలు జరిపి, జలహారతి కార్యక్రమం నిర్వహించారు. చోడవరం ఎమ్మెల్యే రాజు, జలాశయ ఛైర్మన్ పోతల పాత్రునాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.