'ఎలాంటి సమస్య వచ్చిన అండగా ఉంటాం'
RR: షాద్‌నగర్ నియోజకవర్గం ఎస్బీపల్లి గ్రామానికి చెందిన రామచంద్రయ్య గతవారం మృతి చెందారు. దశదిన కర్మ నేపథ్యంలో ఇవాళ మృతుని కుటుంబ సభ్యులను మాజీ జడ్పీటీసీ శ్రీలత సత్యనారాయణ వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం వారికి రూ. 10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామంలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చిన తమ కుటుంబం అండగా ఉంటుందని తెలిపారు.