VIDEO: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత
RR: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుల లగేజీలోని ఐరన్ బాక్స్‌లో దాచి ఉంచిన రూ. కోటి 55 లక్షల విలువైన 1.97 కిలోల బంగారాన్ని DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు.