దొడ్డి కొమరయ్య పోరాటం స్ఫూర్తిదాయకం

దొడ్డి కొమరయ్య పోరాటం స్ఫూర్తిదాయకం

VKB: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య పోరాటపటిమను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెత్తందారులకు వ్యతిరేకంగా, పేదల కోసం ప్రాణాలర్పించిన కొమరయ్య సేవలను కొనియాడారు.