కృష్ణారావుపాలెంలో వైసీపీ కోటి సంతకాల సేకరణ
కృష్ణా: కృష్ణారావుపాలెంలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాసు హాజరయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.