టెట్‌కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

టెట్‌కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

AP: రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ ఇటీవల టెట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు ఇప్పటివరకు 1,97,823 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసారి 17,883 మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఈనెల 23తో దరఖాస్తుల గడువు ముగియనుంది. మొత్తం 66,104 మంది పురుషులు, 1,31,719 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు.