కనకదాసు ఉత్సవాలకు ఎమ్మెల్యే ప్రసాద్‌కు ఆహ్వానం
ATP: ఈ నెల 8న కళ్యాణదుర్గంలో జరగనున్న కనకదాస విగ్రహావిష్కరణ, 538వ జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని జిల్లా కురుబ సంఘం నాయకులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను కోరారు. ఇవాళ ఉదయం ఆయనను కలిసి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. తప్పక వస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.