రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
విశాఖపట్నంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గణేశ్ నగర్ జంక్షన్ వద్ద అతివేగంగా వచ్చిన కంటైనర్, పాల వ్యాన్‌ను ఢీకొనడంతో వ్యాన్‌లో ఉన్న తాడి ధనుంజయ (50) అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో కార్మికుడికి కాలు విరగడంతో స్థానికులు చికిత్స కోసం KGHకి తరలించారు. కంటైనర్ డ్రైవర్ సూర్యనారాయణ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.