'చిన్నారుల సంరక్షణ గృహాలు నిబద్ధతతో నిర్వహించాలి'

'చిన్నారుల సంరక్షణ గృహాలు నిబద్ధతతో నిర్వహించాలి'

NLR: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల చిన్నారుల సంరక్షణ వసతి గృహాలను నిబద్ధతతో నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లాలోని 30 చైల్డ్ కేర్ హోమ్స్‌కు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. జువెనైల్ జస్టిస్ చట్టం- 2015 ప్రకారం పిల్లల భద్రత, ఆరోగ్యం, విద్య, ఆహారం, మానసిక అభివృద్ధి వంటి అంశాలపై పూర్తి శ్రద్ధతో హోమ్స్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.