'ఉద్యమాలకు సిద్ధం కావాలి'.. జగన్ పిలుపు
AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను సీఎం చంద్రబాబు మార్చుకునేలా ఉద్యమాలు చేయాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ విద్యార్థి విభాగానికి సూచించారు. దీనిపై రచ్చబండ ద్వారా కోటి సంతకాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఈ ఉద్యమాలు చంద్రబాబుకు షాక్ తగిలేలా ఉండాలని ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై డిసెంబర్ తర్వాత ఉద్యమిస్తామని జగన్ హెచ్చరించారు.