ఆస్తి కోసం తల్లికి బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు

HYD: హబీబ్ నగర్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి ఆస్తికోసం తల్లినే చంపుతానని బెదిరించసాగాడు. పోలీసుల వివరాలు.. దారుస్సలాం రోడ్డులోని ఓ భవనంలో తల్లి లలితయాదవ్, కుమారుడు శ్రీనివాస్ యాదవ్ ఉంటున్నారు. 2, 3 అంతస్తుల్లో కుమారుడు, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో తల్లి ఉంటున్నారు. తల్లి ఉంటున్న ఫ్లోర్ కూడా కావాలంటూ చంపుతానని బెదిరిస్తున్నాడు. దీంతో తాజాగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.