మొంథా ఎఫెక్ట్.. చితికిపోయిన చిరు వ్యాపారులు
ప్రకాశం: మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలు నగరంలో ఊహించని విధంగా చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కిరణా సామగ్రి, దర్జీలు, తినుబండరాలు అమ్మేవారు, మోటారు మెకానిక్‌లు ఈ తుఫాన్ వల్ల నష్టపోయారు. జన సంచారం తగ్గి అమ్మకాలు సాగక చిరు వ్యాపారులకు పూట గడవని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.