కళ్యాణదుర్గం పట్టణానికి రెండు అదనపు కోర్టులు: ఎమ్మెల్యే

కళ్యాణదుర్గం పట్టణానికి రెండు అదనపు కోర్టులు: ఎమ్మెల్యే

ATP: కళ్యాణదుర్గం పట్టణానికి రెండు అదనపు కోర్టులు మంజూరయ్యాయని, వాటికి కావాల్సిన భవనాలను వెంటనే సిద్ధం చేస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన బార్ కౌన్సిల్ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.