వేపాడలో వర్షం పడితే తిప్పలే !
VZM: వేపాడలో రోడ్డు దుస్థితి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు వాపోతున్నారు. శనివారం సాయంత్రం కురిసిన వర్షంతో ప్రధాన రహదారి నీటితో నిండిపోయింది. వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విశాఖ, విజయనగరం నుంచి నిత్యము విధులు నిర్వహణకు వచ్చే మండల స్థాయి అధికారులు సైతం ఇదే నీటిలో ప్రయాణిస్తున్న పట్టించుకోలేదని జిల్లా అధికారులైనా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.