చిన్న వానకే రోడ్లపై మురుగు ప్రవాహం

చిన్న వానకే రోడ్లపై మురుగు ప్రవాహం

NLG: త్రిపురారం మండలం ఇందిరమ్మ కాలనీ నుంచి కంపసాగర్ వెళ్లే రహదారి వర్షం పడితే చిత్తడిగా మారుతోంది. సీసీ రోడ్డుకు పక్కన నిర్మించిన మురుగు కాలువ ఎత్తుగా ఉండటంతో వర్షపు నీరు బయటకు వెళ్లకుండా రోడ్డుపైనే నిలుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న వర్షానికే రహదారి దాటడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.