పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఉండవల్లి

పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఉండవల్లి

AP: కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుబట్టారు. 'డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు. పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. సీఎం అవుతాడని నేను నమ్మిన పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం' అని అన్నారు.