VIDEO: 'ప్రారంభమైన వరి కోతలు.. గిట్టుబాటు ధర కల్పించాలి'

VIDEO: 'ప్రారంభమైన వరి కోతలు.. గిట్టుబాటు ధర కల్పించాలి'

SRCL: చందుర్తి మండల కేంద్రంలో వరి కోతలు సోమవారం ప్రారంభమయ్యాయి. వరికోతలు ప్రారంభమైనందున వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. మండల కేంద్రంలో రైతులు వరి ధాన్యం ఆరబెట్టుటకు సరైన స్థలం లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మార్కెట్ స్థలం కేటాయించాలని కోరుతున్నారు.