గుండెపోటుతో రైతు మృతి
WGL: నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లి గ్రామంలో రైతు గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన బాదావత్ సోమ్లా మంగళవారం తన చేనులో పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. స్థానికులు సహాయం చేసినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. పంట పనుల మధ్యే రైతు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.