కల్లూరు బరిలో 133 మంది అభ్యర్థులు

కల్లూరు బరిలో 133 మంది అభ్యర్థులు

KMM: కల్లూరు మున్సిపాలిటీలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శనివారం ముగిసింది. మొత్తం 159 మంది అభ్యర్థులు నామినేషన్ల వేయగా... పరిశీలన అనంతరం 133 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఒకే అభ్యర్థి ఒకే పార్టీ తరపున ఒకటి కంటే ఎక్కువ సెట్లు దాఖలు చేసిన సందర్భాల్లో, వారి సమక్షంలోనే విచారించి 26 దరఖాస్తులను 'డూప్లికేట్'గా గుర్తించి పక్కన పెట్టారు.