హనుమాన్ నామస్మరణతో మారుమోగిన బండబావి

హనుమాన్ నామస్మరణతో మారుమోగిన బండబావి

GDWL: గద్వాల దౌదర్పల్లి బండబావి ఆంజనేయ స్వామి ఆలయం గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా భక్తుల రద్దీతో సందడిగా మారింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ఆకుపూజ, సింధూర అలంకరణ వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా జై శ్రీరామ్.. జై హనుమాన్ నామస్మరణతో మారుమోగింది.