తుఫాన్‌తో ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చేశాం: సీఎం
AP: తుఫాన్ కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. 'తుఫాన్‌పై సమాచారాన్ని ముందుగా ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించాం. పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించి కాపాడాం. ప్రార్థనా మందిరం చుట్టూ వరద నీరు వస్తే 15 మందిని కాపాడాం. సాంకేతికతో పాటు అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు సహకరించారు' అని తెలిపారు.