ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన మంత్రి
KMM: కొణిజర్ల మండలం అంజనాపురంలో గోద్రెజ్ కంపెనీ నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న మంత్రి.. ఫ్యాక్టరీని వచ్చే నెలాఖరు వరకు రైతులకు అందుబాటులోకి తెచ్చే విధంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, అధికారులు ఉన్నారు.