అన్న క్యాంటీన్లలో నాణ్యత మెరుగుపరచాలి: కలెక్టర్
KDP: అన్న క్యాంటీన్లలో నాణ్యత మరింత మెరుగుపరచాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సూచించారు. జిల్లా పరిషత్ ఆవరణలోని అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార నాణ్యత, శుభ్రత, నీటి సదుపాయాలను పరిశీలించారు. భోజనం రుచి బాగుందని ప్రజలు చెప్పగా, పరిసరాల్లో పారిశుధ్య లోపాలు గమనించి అధికారులను మందలించారు. క్యాంటీన్లను మరింత శుచిగా నిర్వహించాలని ఆదేశించారు.