'అన్నదాత పోరును జయప్రదం చేయండి'

'అన్నదాత పోరును జయప్రదం చేయండి'

NDL: ఈ నెల 9న ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం నిర్వహించబోయే అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ పట్టణ కార్యదర్శి మన్సూర్ పిలుపునిచ్చారు. సోమవారం నంది కోట్కూరు లోని కార్యాలయం నందు పోస్టర్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు యూరియా, ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వైసీపీ పట్టణ నాయకులు పాల్గొన్నారు.