ఎస్పీ ఆదేశాలతో లాడ్జిలో విస్తృత తనిఖీలు

ఎస్పీ ఆదేశాలతో లాడ్జిలో విస్తృత తనిఖీలు

కృష్ణా: IPL నేపథ్యంలో ఉయ్యూరులోని లాడ్జిల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాలతో ఈ తనిఖీలు చేపట్టినట్లు సీఐ రామారావు తెలిపారు. యువత బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, అప్పుల పాలై ప్రాణాలు తీసుకోవద్దని ఆయన సూచించారు. బెట్టింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే పాత నేరస్థులను బైండోవర్ చేశామన్నారు.