గ్రామంలో డీజేలు పెడితే.. రూ.50 వేలు ఫైన్

గ్రామంలో డీజేలు పెడితే.. రూ.50 వేలు ఫైన్

TG: కొమురంభీం ఆసిఫాబాద్(D) రెబ్బన(M) ఖైరిగూడ గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో పెళ్లిళ్లు, పేరంటాలకు డీజేలు నిషేధమని, హల్దీ వేడుక, ప్రీ వెడ్డింగ్ షూట్ వేడుకలను నిషేధిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. శ్రీరామనవమి అనంతరం గ్రామంలో మద్యపానం, గుడుంబా నిషేధానికి కృషి చేస్తామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.50 వేల జరిమానా విధించబడుతుందని గ్రామస్తుల తీర్మానం చేశారు.