మంత్రి ఇలాఖాలో కొత్త పంచాయితీ..!
SRPT: మంత్రి ఉత్తమ్ ఇలాఖాలో పంచాయతీ పోరు కొత్త పంచాయితీకి తెరతీసినట్లు తెలుస్తోంది. మంత్రి ఆదేశాల మేరకు సమన్వయ కమిటీలు ప్రజామోదం ఉన్న నాయకులను ఎంపిక చేయాలని చెప్పినా, కొన్ని గ్రామాల్లో కమిటీ సభ్యులు వ్యక్తిగత అజెండాతో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పలుచోట్ల రెబల్ అభ్యర్థులు రంగంలోకి దిగే పరిస్థితి కనిపిస్తోంది.