'డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు తొలగించాలి'

'డ్రైనేజీలపై అక్రమ నిర్మాణాలు తొలగించాలి'

GNTR: పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ముబారక్ నగర్, 21వ వార్డులో నూతనంగా నిర్మించిన డ్రైనేజీలపై అక్రమంగా నిర్మించిన పార్కింగ్ స్లాబ్‌లను వెంటనే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతమైతే ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.