VIDEO: గుంతల మయమైన రోడ్డు.. పట్టించుకోని అధికారులు

KNR: గన్నేరువరం నుంచి మైలారం గ్రామానికి వెళ్లే రహదారి వర్షం పడిన ప్రతిసారి చిన్నపాటి చెరువును తలపిస్తుంది. వర్షం పడితే ఈ దారిలో గుంతలు పడి వర్షపు నీటితో కోతలకు గురై అధ్వానంగా మారుతుందని, పాలకులు మారినా పట్టించుకునే వారే లేరని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు ఈ నరకయాతన అని మండిపడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.