సామెత-దాని అర్థం
సామెత: ముల్లును ముల్లుతోనే తీయాలి
అర్థం: కాలిలో గుచ్చుకున్న ముల్లును పదునైన ముల్లుతో లేదా దానిలా పదునుగా ఉండే సూదితోనే తీయాలి. వేరేవాటితో ప్రయత్నిస్తే కాలిలోని ముల్లు మరింత లోపలకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. మోసపరులను మోసంతోనే జయించాలి అనే సందర్భంలో ఈ సామెత వాడుతుంటారు.