జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం సమీక్ష

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్, మంత్రులతో కలిసి ఆదివారం సాయంత్రం 6 గంటలకు భేటీ కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థి ఎంపిక, ప్రచారంపై చర్చించనున్నట్లు సమాచారం.