ప్రారంభమైన నిరవధిక నిరాహార దీక్ష

ప్రారంభమైన నిరవధిక నిరాహార దీక్ష

KNR: హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభమైంది. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, 50 సంవత్సరాలు దాటిన రైతులకు నెలకు రూ.6 వేలు పెన్షన్ ఇవ్వాలని, ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు ప్రజా సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.