వరంగల్ మార్కెట్లో నేటి సరుకుల ధరలు ఇలా..!

వరంగల్ మార్కెట్లో నేటి సరుకుల ధరలు ఇలా..!

వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్‌లో గురువారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,280 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.22వేలు ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.37వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.19,400, ఎల్లో మిర్చి రూ. 21,500, టమాటా మిర్చి రూ. 42వేలు పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.