వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NGKL: జిల్లా కేంద్రంలోని నెల్లికొండ చౌరస్తాలో ఉన్న మార్కెట్ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన ధర కల్పించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణ రావు, వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు.