కాలుష్యంపై పోరాడుదాం.. కాల్ చేయండి!

HYD: నగరంలోని మూసీ, ఇతర నాలాలు కలుషితమయంగా మారాయి. మూసీలో కెమికల్ వ్యర్థాలతో పాటు, బయో మెడికల్ వ్యర్థాలు సైతం ఇటీవల దర్శనమిస్తున్నాయి. HYDలో కాలుష్యానికి చెక్ పెట్టేందుకు PCB చర్యలు చేపట్టింది. పరిశ్రమల ద్వారా ఎయిర్ పొల్యూషన్, మూసీలో వ్యర్థాలు వదలడం, వివిధ కంపెనీలు రసాయనాలను కాలువల్లో కలిపితే 040-23887500కు కాల్ చేయాలని PCB కోరింది.